aaraadhyudavu neeve prabhu ఆరాధ్యుడవు నీవే ప్రభు
ఆరాధ్యుడవు నీవే ప్రభు
ఆనందముతో ఆరాధింతును (2)
అత్యున్నత ప్రేమను కనుపరచినావు
నిత్యము నిను కొనియాడి కీర్తింతును (2) ||ఆరాధ్యుడవు||
పేతురు వలె నేను ప్రభునకు దూరముగా
పనులతో జనులతో జతబడి పరుగెత్తగా (2)
ప్రయాసమే ప్రతిక్షణం ప్రతి నిమిషం పరాజయం
గలిలయ తీరమున నన్ను గమనించితివా (2) ||ఆరాధ్యుడవు||
ప్రభురాకడ నెరిగి జలజీవరాసులు
తీరము చేరిరి కర్తను తేరి చూడగా (2)
పరుగెత్తెను పలు చేపలు ప్రభు పనికై సమకూడి
సంతోషముతో ఒడ్డున గంతులేసెను (2) ||ఆరాధ్యుడవు||
నిన్నెరుగను అని పలికి అన్యునిగా జీవించితి
మీనముతో భోజనము సమకూర్చితివా (2)
ఆచేపల సమర్పణ నేర్చితి నిను వెంబడింతు
అద్వితీయ దేవుడవు నీవే ప్రభు (2) ||ఆరాధ్యుడవు||
aaraadhyudavu neeve prabhu
aanandamutho aaraadhinthunu (2)
athyunnatha premanu kanuparachinaavu
nithyamu ninu koniyaadi keerthinthunu (2) ||aaraadhyudavu||
pethuru vale nenu prabhunaku dooramugaa
panulatho janulatho jathabadi parugetthagaa (2)
prayaasame prathikshanam prathi nimisham paraajayam
galilaya theeramuna nannu gamaninchithivaa (2) ||aaraadhyudavu||
prabhu raakada nerigi jalajeevaraasulu
theeramu cheriri karthanu theri choodagaa (2)
parugetthenu palu chepalu prabhu panikai samakoodi
santhoshamutho odduna ganthulesenu (2) ||aaraadhyudavu||
ninneruganu ani paliki anyunigaa jeevinchithi
meenamutho bhojanamu samakoorchithivaa (2)
aa chepala samarpana nerchithi ninu vembadinthu
advitheeya devudavu neeve prabhu (2) ||aaraadhyudavu||