balulu arpinchutakante nee బలులు అర్పించుటకంటే నీ
బలులు అర్పించుటకంటే నీ
ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము
పొట్టేళ్ళ క్రొవ్వును అర్పించుటకంటే
నీ మాటకు లోబడుట శ్రేష్టము.
శ్రేష్టము శ్రేష్టము మాటవినుట శ్రేష్టము
శ్రేష్టము శ్రేష్టము లోబడుట శ్రేష్టము.
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా….
1. నీ మాటను వినిన అబ్రాహాము
విశ్వాసుల తండ్రిగా మారినాడుగా
నీ మాటను వినిన సమూయేలు
అభిషేకించు ప్రవక్త ఆయెగ….
మాట వినుట మాకు నేర్పుము
నీ మార్గములో మమ్ము నడుపుము
2. నీ మాటను వినిన గిద్యోను
పరాక్రమశాలిగా మారినాడుగా
నీ మాటను వినిన దావీదు రాజు
శాశ్వత సింహాసనం పొందినాడుగా
మాట వినుటను మాకు నేర్పుము
నీ మార్గములో మమ్ము నడుపుము