• waytochurch.com logo
Song # 27679

Vinare narularaa vinthaina dhevuni prema వినరే నరులరా వింతైన దేవుని ప్రేమ…


వినరే నరులరా వింతైన దేవుని ప్రేమ…
కనరే కనులారా కొంతైనా తండ్రి శ్రమ…
విస్తారమైన ఈవులను నీకిస్తే… విలువైన జీవితాన్ని అనుగ్రహిస్తే
విరివిగ ఫలియింపక వివేకంతో నడువక వాక్యంతో వెలుగక అనుకువతో మెలగనిచో
అంధకారమే మరణాంతరం… ఆరని అగ్నిలో నిరంతరం
అడగకమునుపే అన్నీ ఇచ్చిన దాతను చూడు
శూన్యములో సమస్తమును చేసిన ఆ సర్వోన్నతుని వేడు
నువ్వే కావాలని అనుకున్నాడు- తనకై బ్రతకాలని ఆశించాడు
బాల్యం నుండి బాధిస్తూ ఉన్నా- భరియిస్తూనే లాలిస్తున్నాడు
అందరినీ తన యొద్దకు ఆకర్షించే ఆలోచనతోనే వివరిస్తున్నాడు
కన్నవారి కటాక్షమునకై విన్నదానిపై విశ్వాసముంచనిచో
అవిదేయులపై జలప్రళయం- కామాందులనే కాల్చేసిన వైనం
ఆజ్ఞానుసారంగా జీవిస్తేనే అక్షయకిరీటం
అందుకై ప్రవక్తలను జ్ఞానులను పంపి ప్రకటింపజేయడం
తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న వారినే- కనికరించి నీకై పంపిస్తే
తానే మార్గం సత్యం జీవమని జనుల మధ్య నిరూపించి చూపిస్తే
బలియైన ముక్తి ప్రధాత – మహత్యాగమును విస్మరిస్తున్నావు
కలుషములను కడుగుకొని – కరుణించు కర్తను కాంచనిచో
శాపమై వేళ్ళతో పెళ్లగింపబడతావ్ – రాతి మీద రాయి లేని దేవాలయమవుతావ్

vinare narularaa vinthaina dhevuni prema
kanare kanulaaraa konthainaa thandri srama
visthaaramaina eevulanu neekisthe …viluvaina jeevithaanni anugrahisthe
viriviga phaliyimpaka vivekamtho naduvaka
vaakyamtho velugaka anukuvatho melaganicho
andhakaarame marannantharam ..aarani agnilo nirantharam
adagakamunupe annee icchina dhaathanu choodu
soonyamulo samasthamunu chesina aa sarvonnathuni vedu
nuvve kaavaalani anukunnaadu – thanakai brathakaalani aasinchaadu
baalyam nundi baadhistoo unnaa – bhariyisthoone laalisthoonnaadu
andharini thana yoddhaku aasarshinche aalochanathone vivaristoonnaadu
kannavaari kataakshamunakai vinnadhaanipai viswaasamunchanicho
avidheyulapai jalaprallayam – kaamaandhulane kaalchesina vainam
aagnanusaaramgaa jeevisthene akshyakireetam
andhukai pavakthalanu gnaanulanu pampi prakatimpajeyadam
thandri kudi paarswamuna koorchunna vaarine – kanikarinchi neekai pampisthe
thaane maargam sathyam jeevamani janula madhya niroopinchi choopisthe
baliyaina mukthi pradhaatha – mahathyaagamunu vismaristunaavu
kalushamulanu kadugukoni – karunninchu karthanu kaanchanicho
saapamai vellatho pellgimpabadathaav – raathi meedha raayi leni dhevaalayamavuthaav


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com