nanu kalugajesina vidhamu thalaposina నను కలుగ జేసిన విధము తలపోసిన
నను కలుగ జేసిన – విధము తలపోసిన
భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున
అ.ప: స్తుతులు చెల్లించుచున్నా అందువలన
తన స్వరూపమున నరుని నిర్మించిన
అందమైన సృష్టిపైన అధికారమిచ్చిన
దేవుడు తనకంటే కొంతే నను తక్కువగాను చేసెను
ఇంత కృప పొందే యోగ్యం ఏముంది నాలోన
మంటిదేహమున మహిమను నింపిన
శ్రేష్టమైన వైభవమును ధరియింపజేసిన
దేవుడు తన గ్రంధమునందు నా దినములు రాసియుంచెను
ఇంత ప్రేమానురాగం ఏలనో నాపైన
ఘనపరచదగిన మన ప్రభువు చేసిన
దివ్యమైన ఆకసమును తారలను చూచిన
దేవుడు నను దర్శించుటకు నరుడను ఏపాటివాడను
ఇంత ఆత్మీయ బంధం ఎందుకో నాతోన