saathwikamunu kanaparachavalenu సాత్వికమును కనపరచవలెను
సాత్వికమును కనపరచవలెను
కనికరముతో అందరియెడలను
ప్రతి సత్కార్యము చేయుటకును
సిద్ధపడియుండవలెను
అ.ప: పోగొట్టుకోకు ఎవరినైనను
ప్రేమతో రక్షించు కొందరినైనను
1. దేవుని దయను మనుష్యుల దయను
యేసు సంపాదించెను
ఎవ్వరితో విరోధము కూడదు
అందరితోనూ సమాధానము
2.జ్ఞానము చివరకు నిరర్ధకమగును
ప్రేమ శాశ్వతముండును
వాక్యమును పఠించిన చాలదు
పాటించితేనే ఆశీర్వాదము
3.చూసిన మనలో ఆత్మఫలమును
క్రీస్తు సంతోషించును
గర్వముతో పరిస్థితి మారదు
మేలుతోనే కీడుపై విజయము