sarvonathuda vijayaveeruda సర్వోన్నతుడ విజయవీరుడ
సర్వోన్నతుడ! విజయవీరుడ
ప్రియుడ నా శిల్పకారుడ
ఎవ్వరు లేరు నాకు యేసయ్యా
నీ సన్నిది చాలు నాకు మేసయ్యా
అ.ప: ఇంతకంటె భాగ్యమంటయ్యా
నాకు నీకంటె ఘనులెవరయ్యా
గడచిన కాలంలో కనురెప్పలా
నీ చాటున దాచిన నా గొప్ప కాపరి
వేల్పులలో నీవు మహనీయుడవు
నన్నెన్నడు యెడబాయని తండ్రివినీవే
నా తండ్రివి నీవే
దయగలదేవుడవీ ధరణీయందున
వ్యర్ధుడు చెరపలేడు నా క్షేమమును
నే గాడాంధకారపు లోయలో నడిచినను
నీ దుడ్డు కర్ర ధండము ఆధరించునే నన్నాదరించునే
రాబోవు శ్రేష్ఠమైన రాజ్యము కొరకు
వెనుదీయక గురి యొద్దకు సాగివెళ్ళదన్
నిర్జీవ గడియలు నిలదీసినగాని
నా మనస్సు నీపైనే ఆనుకొందునే
నే నను కొందునే
విమర్శలకు కృంగను నా హృదయమందున
నా స్థితిని మార్చేస్తుతి పాత్రుడుండంగ
పునరుద్ధానుడ నా పితరులదేవా
జయమునిచ్చు క్షేత్రములో యాత్ర చేసెదన్
నే యాత్ర చేసిదన్