parishuddhudu athiparishuddhudu nannu nadupuchunna naa goppa dhevudu పరిశుద్ధుడు అతిపరిశుద్ధుడు నన్ను నడుపుచున్న నా గొప్ప దేవుడు
పరిశుద్ధుడు అతిపరిశుద్ధుడు నన్ను నడుపుచున్న నా గొప్ప దేవుడు
ఆరాధన యేసయ్యకే – నా స్తుతికి పాత్రుడు తానే
నా యుద్ధములో ఆత్మ ఖడ్గమై అపవాది తంత్రముపై జయము నిచ్చాడు
తన చిత్తమును నే నెరవేర్చుటకు సర్వాంగ కవచమే ధరియింప జేసాడు
నా వేదనలో అండగ నిలిచి మరణభయము లేకుండ తప్పించినాడు
నిందకు ప్రతిగా పూదండనే ఇచ్చి ఆనంద తైలముతో అభిషేక మిచ్చాడు
నా శ్రమయందు ఓర్పుతో నింపి నే కృంగి పోకుండా కాపాడుకున్నాడు
లోకమునుండి నన్ను విడిపించి పట్టుదలతో ప్రార్ధింప నేర్పించి యున్నాడు