kalyaana raagam saagindhi mangalavaadhyam mrogindhi కళ్యాణరాగం సాగింది మంగళవాద్యం మ్రోగింది
కళ్యాణరాగం సాగింది మంగళవాద్యం మ్రోగింది
పరమందలి నిర్ణయం ఇల నేటి పరిణయం
అ.ప. : తలిదండ్రుల విడచిన వీరిరువురు
హత్తుకొని ఒక్కటే శరీరమైయుందురు
ప్రక్కటెముకను స్త్రీనిగా ఇల్లు చక్కబెట్టుటకు భార్యగా
భర్తకనుగ్రహించెను సరియైన తోడుగా
లోబడియుండుమని అన్నింటా పూర్తిగా
నడుపుకోవాలని సంసారం తెలివిగా
ఇంటిపైన యజమానిగా ప్రేమ పంచిపెట్టుటకు భర్తగా
బాధ్యతప్పగించెను పురుషునికి మోయగా
లోగిట అందరిని పోషించి బాగుగా
భక్తిలో పెంచాలని సంతోషం విరియగా
ఇన్నినాళ్ళ ఆశ తీరగా నేడు కన్నకల నిజమవ్వగా
పాట ప్రతిధ్వనించెను హృదయాలు పొంగగా
దేవుని సన్నిధిని ప్రార్దించి నేరుగా
కలిమి పొందాలని సంగీతం పలుకగా