taragani nee prema virivigi naloo sirulukuripichene తరగని నీ ప్రేమ విరివిగ నాలో సిరులుకురిపించెనే
తరగని నీ ప్రేమ విరివిగ నాలో సిరులుకురిపించెనే
చెరగని నీ రూపు నిరతము నాలో సరిగమ పలికించెనే
ఆ|| ప || తంబుర సితార వాధ్యములతో స్వరమెత్తుకుని
తండ్రిదేవా మనసార నిన్నే ఆరాధింతును నీలో ఆనందింతును
నిన్ను విడిచి నా హృదయం – వెనుకకు మరలునా
నన్ను పిలిచి ఉన్నత స్థలమున – పాదములు నిలుపగా
ప్రేమించి జీవవాక్యముతో పోషించింతివి
రక్షించి శాంతిజలముల చెంత నడిపితివి
నిన్ను తలచిన ప్రతీ క్షణం-ఆటంకము ఆపునా
నన్ను నడిపిన ప్రతీ స్థలం – అద్బుతములు చేయగా
దీవించి గొప్పచేయ మొదలు పెట్టితీవి
కరుణించి క్షేమాభివృద్దితో నింపితివి
నీతో గడిపిన మధురజ్ఞాపిక – నామదిలో మరుగాయేనా
నాతో పలికిన ప్రమాణము నెరవేరుచుండగా
నియమించి నిండుగాదీవెన పంచితివి
ఆత్మనింపి క్రీస్తు నీయందే నను పెంచితివి