deevinchaave samruddhigaa nee saakshigaa konasaagamani దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని
దీవించావే సమృద్ధిగా – నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా – నీ కోసమే నను బ్రతకమని
దారులలో.. ఎడారులలో.. సెలయేరులై ప్రవహించుమయా..
చీకటిలో.. కారు చీకటిలో.. అగ్ని స్తంభమై నను నడుపుమయా.. ||దీవించావే||
నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
ఊహలలో.. నా ఊసులలో.. నా ధ్యాస బాసవైనావే..
శుద్ధతలో.. పరిశుద్ధతలో.. నిను పోలి నన్నిల సాగమని.. ||దీవించావే||
కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)
ఆశలలో.. నిరాశలలో.. నేనున్నా నీకని అన్నావే..
పోరులలో.. పోరాటములో.. నా పక్షముగానే నిలిచావే.. ||దీవించావే||