israelukaadharuda yessaiah ఇశ్రాయేలుకాధారుడా యేసయ్య నిత్యం నిన్నే కొలుతును
ఇశ్రాయేలుకాధారుడా - యేసయ్య- నిత్యం నిన్నే కొలుతునుపల్లవి : ఇశ్రాయేలుకాధారుడా - యేసయ్య- నిత్యం నిన్నే కొలుతును నా యేసయ్య నాకున్న ఏకైక ఆధారం నీవయ్యా ఏమున్నా లేకున్నా నిను విడువను యేసయ్య.1.శత్రుసమూహములు ముట్టడివేయగా ఆపద సమయములు ఆవరించగా యుద్ధము చేయుటకు మాశక్తి చాలక రాజుల రాజైన నీ వైపు చూడగా యుద్ధమునాదన్నావే విజయము మాకిచ్చావే - అభయము నేనన్నావే ఆశ్రయము నీవైనావే. "నా కున్న ఏకైక "2.నా అన్నవారే నన్ను నిందించగా శ్రమలు వేదనలు వెన్నంటి రాగా చేయని తప్పులకు నిందలు పొందగా పొందిన మేలులు ఎందరో మరువగా తోడుగా నిలిచావు నీ కృపలను చూపావు ఉన్నత మేలులతో బహుగా దీవించావు "నాకున్న ఏకైక"3.వ్యాధిబాధలు క్రుంగదీసినప్రాణ భీతి ననువెంటాడిన అవేదనలతో నేతల్లడిల్లగా ఆదరణ లేక నే అలసిపోగా కరునతో సంధించావు నా కన్నీటిని తుడిచావు - నీ కమ్మని కౌగిట దాచి నా కలతలను తీర్చావు "నాకున్న ఏకైక