preminchi nannu naa priya yesu ప్రేమించి నన్ను నా ప్రియ యేసు
ప్రేమించి నన్ను నా ప్రియ యేసు
నీ ప్రేమలోనే నడిపించినావు
దర్శించి నన్ను దీవించినావు
కరుణించి నన్ను కాపాడినావు
ఏ రీతి నిన్ను సేవింతునయ్యా
నా యేసు నిన్నే పూజింతునయ్యా
మార్గము నీవే క్షేమము నీవే – చల్లగ చూసే దేవుడ నీవే
ఈ బ్రతుకంతా నీ పాద చెంత – నా ప్రభు నీవే అణువణువంతా
నీ కృపలోనే నా బలమంతా – కాపరి నీవే ప్రభూ
నీ దయలోనే జీవితమంతా – నా గురి నీవే ప్రభూ
నా గురి నీవే ప్రభూ
కొండలలోన లోయలలోన – అండగా నీవై నడిపిన దేవా
వేదనలోన శోధనలోన – తోడుగా నీవై నిలచిన దేవా
ఉన్నతమైన నీ ఘనకార్యం – ఏమని వివరింతును
ఆశ్రయమైన నీ సన్నిధానం – ఎంతటి నా భాగ్యము
ఎంతటి నా భాగ్యము
With your love, my dear Jesus you have led me in the paths of your love you have visited me and blessed me by your mercy, you have saved me how can I serve you, my Lord? my Jesus, I will praise you forever! You are the way, my well-being and the God who takes care of all my needs my life is at your feet, my Jesus you are my everything! all my strength is in your grace , you are my shepherd! you lead my life with your compassion, Jesus you are my goal! Jesus you are my goal! You have been by my side through the hills and the valleys you have stood with me in my pain and the temptations how can I describe your marvelous works in my life how fortunate am I that your presence is my refuge, how fortunate am I