Ennenno melulatho nanu dheevinchaavu ఎన్నెనో మేలులతో నను దీవించావు
ఎన్నెనో మేలులతో నను దీవించావు
నా జీవితకాలమంత యెరిగి ఉన్నావు
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలను
ఎన్ని రీతులుగా కీర్తించగలను
వందనాలు యేసయ్య నీకే
శతకోటి స్తోత్రలయ్యా నీకే – 2 || ఎన్నెనో మేలులతో ||
కష్టాల మార్గములో అలసిన పయణములో
నిందలు మోయలేక కృంగిన సమయములో – 2
సంపూర్ణముగా నాకు పరిశుద్దతనిచ్చావు
సమాధాన కర్తవు నీవై నన్ను ఆదరించావు – 2 || వందనాలు ||
ఏ గమ్యము ఎరుగని నా జీవిత యాత్రలో
అలజడి అలలెన్నో చెలరేగెను నా మదిలో – 2
కలవరమును కరిగించి, కరుణను కురిపించావు
నా భయమును గద్దించి, నీ శాంతితో నింపావు – 2 || వందనాలు ||
కలిగేటి శోధనలు, కనపడని మార్గములు
నీ వాక్యమే దీపముగా, సాగెను నా పాదములు – 2
అపవాదిని నా చేత, ఓడింప జేసావు
వాగ్దాన పూర్ణుడిగా జయ జీవిత మిచ్చావు – 2 || వందనాలు ||
ennenno melulatho nanu dheevinchaavu
naa jeevithakaalamantha yerigi unnaavu
emichi nee runamu ne theerchagalanu
enni reethulugaa keerthinchagalanu
vandhanaalu yesayya neeke
sathakoti sthothraalayyaa neeke – 2 || ennenno ||
kastaala maargamulo alasina payanamulo
nindhalu moyaleka krungina samayamulo – 2
sampoornamugaa naaku parisuddhatha nichaavu
samaadhana karthavu neevai nannu aadharinchaavu – 2 || vandhanaalu ||
ey gamyamu erugani naa jeevitha yaathralo
alajadi alalenno chelaregenu naa madhilo -2
kalavaramunu kariginchi, karunanu kuripinchaavu
naa bayamunu gaddhinchi, nee saanthitho nimpaavu – 2 || vandhanaalu ||
kaligeti sodhanalu, kanabadani maargamulu
nee vaakyame dheepamugaa, saagenu naa paadhamulu – 2
apavaadhini naa chetha, odimpa jesaavu
vaagdhaana poornudigaa jaya jeevitha michaavu – 2 || vandhanaalu ||