• waytochurch.com logo
Song # 2772

laechu dhinamu vachchunu mruthలేచు దినము వచ్చును మృతు లెల్ల


Chords: ragam: పంతువరాళి-pMthuvaraaLi

లేచు దినము వచ్చును మృతు లెల్ల నికఁ లేచు దినము వచ్చును వేచి
యిల నున్నట్టి విమలు లెల్ల నడుపు లేచి ప్రభుని నెదురు కొందు
రానందముతో ||లేచు||

1. యేసు మేఘారూఢూండై యిలకు దిగ వాసిగ దూత లపుడు
భాసురంబుగ బాకా పై నినాదము సేయ గ సమాధుల నిద్రగాంచు
జనులెల్లరు ||లేచు||


2. కడబూర ధ్వని సేయఁగ మడిసిన వారు తడవు సేయక లేతురు
ఎడతెగక ప్రభు నొద్దఁ గడు సంతసంబుతో విడువక యుందు రా
విమల లోకమునందు ||లేచు||


3. ఘన మహిమన్ బ్రభువు రాఁగన్ గడలి యపుడు తన యందుండెడి
శవములన్ ఘనముగఁ గాననము దనయందుండెడు మృతులన్
వినయంబుతో దెచ్చి విభుని కప్పగింప ||లేచు||


4. అరయంగ నీతపరు లా నందమున న క్షర దేహులై వెలయుచున్ జిరత
రానందంబు బరలోకమున నెపుడు స్ఫురిత జీవను లగుచుఁ బరమ
సుఖ మొందుదురు ||లేచు||


5. కరుణ లేని సమాధీ నిరతము నన్నుఁ జెరపట్టి యుంచగలవే వరదుండు
క్రీస్తుండు వర దూత సేనలతోఁ బరివేష్టితుఁడై యదిగో నరుదెంచుచున్నాఁ
డు ||లేచు||


6. మరణమా నీ ముల్లేది నరులను నింక వెఱపించు చుండగలవే
మరణ సంహారుండు మహిమతో నరుదేరన్ మరణం బడుగుబడి య
మర త్వంబిఁక నుండున్ ||లేచు||


7. మరణంబు నొందలేదా ప్రభు యేసు నీ చెఱయందు నుండలేదా
పరమేశు తనయుండు మరణ సమాధులన్ పరిపూర్ణముగ గెల్చి చెఱను
జెరగపట్టెను ||లేచు||


8. మంగళములు పాడరే క్రీస్తుకు జయ మంగళములు పాడరే
మంగళములు పాడి మంగళ ప్రదుఁడైన శృంగార రాజునకు
సంగీతంబులతోడ మంగళములు పాడరే ||లేచు||

laechu dhinamu vachchunu mruthu lella nikAO laechu dhinamu vachchunu vaechi
yila nunnatti vimalu lella nadupu laechi prabhuni nedhuru koMdhu
raanMdhamuthoa ||laechu||

1. yaesu maeghaarooDooMdai yilaku dhiga vaasiga dhootha lapudu
bhaasurMbuga baakaa pai ninaadhamu saeya ga samaaDhula nidhragaaMchu
janulellaru ||laechu||


2. kadaboora Dhvani saeyAOga madisina vaaru thadavu saeyaka laethuru
edathegaka prabhu nodhdhAO gadu sMthasMbuthoa viduvaka yuMdhu raa
vimala loakamunMdhu ||laechu||


3. ghana mahiman brabhuvu raaAOgan gadali yapudu thana yMdhuMdedi
shavamulan ghanamugAO gaananamu dhanayMdhuMdedu mruthulan
vinayMbuthoa dhechchi vibhuni kappagiMpa ||laechu||


4. arayMga neethaparu laa nMdhamuna na kShra dhaehulai velayuchun jiratha
raanMdhMbu baraloakamuna nepudu sphuritha jeevanu laguchuAO barama
sukha moMdhudhuru ||laechu||


5. karuNa laeni samaaDhee nirathamu nannuAO jerapatti yuMchagalavae varadhuMdu
kreesthuMdu vara dhootha saenalathoaAO barivaeShtithuAOdai yadhigoa narudheMchuchunnaaAO
du ||laechu||


6. maraNamaa nee mullaedhi narulanu niMka veRapiMchu chuMdagalavae
maraNa sMhaaruMdu mahimathoa narudhaeran maraNM badugubadi ya
mara thvMbiAOka nuMdun ||laechu||


7. maraNMbu noMdhalaedhaa prabhu yaesu nee cheRayMdhu nuMdalaedhaa
paramaeshu thanayuMdu maraNa samaaDhulan paripoorNamuga gelchi cheRanu
jeragapattenu ||laechu||


8. mMgaLamulu paadarae kreesthuku jaya mMgaLamulu paadarae
mMgaLamulu paadi mMgaLa pradhuAOdaina shruMgaara raajunaku
sMgeethMbulathoada mMgaLamulu paadarae ||laechu||

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com