siluvalo vrelaade nee korake సిలువలో వ్రేలాడే నీ కొరకే
సిలువలో వ్రేలాడే నీ కొరకే
సిలువలో వ్రేలాడే
యేసు నిన్ను పిలచుచుండే
ఆలస్యము నీవు చేయకుము
యేసు నిన్ను పిలచుచుండే
కల్వరి శ్రమలన్ని నీ కొరకే
ఘోర సిలువ మోసి కృంగుచునే
గాయములచే బాధనొంది
రక్తము కార్చి హింసనొంది
నాలుక యెండెను దప్పి గొని
కేకలు వేసెను దాహమని
చేదు రసమును పానము చేసి
చేసెను జీవయాగమును
అగాధ సముద్ర జలములైనా
ఈ ప్రేమను ఆర్పజాలవుగా
ఈ ప్రేమ నీకై విలపించుచూ
ప్రాణము ధార బోయుచునే