manchi snehithudu manchi snehithudu మంచి స్నేహితుడు మంచి స్నేహితుడు
మంచి స్నేహితుడు మంచి స్నేహితుడు
హితమును కోరే బ్రతుకును మార్చే
ప్రాణ స్నేహితుడేసు ప్రాణ స్నేహితుడేసు
ఒరిగిన వేళ పరుగున చేరి
గుండెలకదిమే తల్లవుతాడు
అక్కరలోన పక్కన నిలిచి
చల్లగా నిమిరే తండ్రవుతాడు
ఒంటరితనమున చెలిమవుతాడు
కృంగిన క్షణమున బలమవుతాడు
చీకటి దారుల తడబడు ఘడియల
వెచ్చగ సోకే వెలుగవుతాడు
పతనపు లోయల జారిన వేళల
చెయ్యందించే గెలుపవుతాడు
శోధనలోన ఓర్పవుతాడు
శోకంలో ఓదార్పవుతాడు