ontari vela naaku thodai nilichaavu ఒంటరి వేళ నాకు తోడై నిలిచావు
ఒంటరి వేళ నాకు తోడై నిలిచావు –
నా చేంతనే నిలిచి నా స్నేహితుడైనావు
ఆధారం ఆధారం నీవే నాకు ఆధారం
ఆశ్రయము ఆశ్రయము నీ కృపే నాకు ఆశ్రయము
రోగము చేత నేను కృoగియున్నపుడు –
నీ గాయపడిన హస్తం చేత బాగు చేసావు
నా కొరకెన్నయ్యా నీవు దెబ్బలు నొందావు
నీవు పొందిన గాయము ద్వారా స్వస్థత నొసిగావు
పాపము చేసి నేను దూరమైనపుడు –
నీ రక్తముతో నను కడిగి చేరదీసావు
శిలువలో నా కొరకై రక్తము కార్చవు
నీవు కార్చిన రక్తము ద్వారా విడుదల నొసిగావు