naa praaname neevaina vela nee thalapule madhilo medhilene నా ప్రాణమే నీవైన వేళ నీ తలపులె మదిలో మెదిలెనే
నా ప్రాణమే నీవైన వేళ – నీ తలపులె మదిలో మెదిలెనే
నా పాటకు పలికావే – నీ మాటకు రూపమునిచ్చావే
నా మౌనానికి భాషే నీవు – నా బ్రతుకుకు అర్ధం నీవు
“ఆహా ఏమి అనుభవమో – ఇది ఎంతో అద్భుతమో”
“ఆహా ఏమి అనుభవమో – యేసుతో నా జీవితం”
నీతో బ్రతకడానికి – అనుదినము చేస్తున్న పోరాటము
నా చేతులకు యుద్ధం – వ్రేళ్ళకు పోరాటం నేర్పావే
చేజారిన జీవితం నీయందు విశ్వాసము విజయమునిచ్చెనే
నీతో నడవాలని – అనుదినము నాకున్న ఆరాటము
పరిశుద్ధాత్మను పంపి – నూతన బలముతో నింపావే
దప్పిగొన్న ఆత్మను ఎడారిలో నీటి బుగ్గవై దాహము తీర్చావే