kaluvari premanu kanugonavela కలువరి ప్రేమను కనుగొనవేల
కలువరి ప్రేమను కనుగొనవేల
సిలువ విలువను ఎరుగవదేల
నీ నా పాపము మరణ శాపమై మ్రానుగ పడెను ఆయన వీపుపై
కరమున శిరమున ముండ్లబాధలు
దేహము నిండా రక్తపు ధారలు
నీతి సూర్యుని శ్రమగనలేకసూర్యుడే మరుగై వెలుగు దాచెనా
సైనికుడొకడు గుండె కరుగగా
నీతిమంతుడితడని మహిమపరచెనా