aadhainchumayyaa aadhukonevaadaa ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా
ఆదరించుమయ్యా – ఆదుకొనేవాడా
చేరదీయుమయ్యా – సేదదీర్చేవాడా
యేసయ్య – యేసయ్య – నీ మీదే నా ఆశయ్య
రెక్కలే విరిగినా – గువ్వనై నే వొరిగినా
ఎండలో వాడినా – పువ్వునై నే రాలినా
దిక్కు తోచక నిన్ను చేరితి
కాదనవని నిన్ను నే వేడితి
నను దర్శించుమో నా యేసయ్య
నను ధైర్యపరచుమో నా యేసయ్యా
ఆశలే అడుగంటెనే – నిరాశలే నను ముంచెనే
నీడయే కరువాయెనే – గూడుయే చెదరిపోయెనే
నీ తోడు నే కోరుకొంటిని
నీ పిలుపుకై వేచియుంటిని
నీ దరిచేర్చుకో- నా యేసయ్య
నన్ను కాదనకుమా – నా యేసయ్యా