Raava yesu deva neeve naa varamuga రావా యేసుదేవా నీవే నా వరముగ
రావా యేసుదేవా – నీవే నా వరముగ
దారే చూప రావా – నడిపించే దేవా రావా
ఈ కడలిలో నలిగిన నా హృదయముతో
నిను కొలుతును నా ప్రభువా
రావా తోడు రావా – నీవే జీవ నావ
పొంగేటి ప్రేమై రావా – నాతో ఉండిపోవా
1. ఏలో ఏలో – అంటు సాగే – నాదు నావ
మబ్బే కమ్మీ – గాలే రేగే – నీవు లేక
ఆశే నీవు – నాదు ప్రభువ – ఆదుకోవా
దూరమైన – వెల్లువైన – నాతో రావా
కడలిలోన – కరుణ చూపే – దీపం కావా
ఏ బంధమో – అనుబంధమో
బ్రతుకంత నీదేగా – కరుణించ రావయ్యా
2. కొండా కోన – నింగీ నేల – చాలనంత
పొంగీపోయే – ప్రేమే నీది – సంద్రమంత
చూసే నీవు – నాదు బ్రతుకు – భారమంతా
ఆదరించే – అమ్మ వంటి – దైవమే నీవు
దయను చూపే – దరికి చేర్చే – నేస్తమే నీవు
ఏ రాగమో – అనురాగమో
కడదాకా నీవేగా – కృప చూప రావయ్యా
raava yesu deva – neeve naa varamuga
dhaare choopa raava – nadipinche deva raava
ee kadalilo naligina naa hrudayamutho
ninu koluthunu naa prabhuvaa
raava thodu raava – neeve jeeva naava
pongeti premai raava – naatho undipova
1. yelo yelo – antu saage – naadhu naava
mabbe kammi – gaale rege – neevu leka
aase neevu – naadhu prabhuva – aadhukova
dhooramaina – velluvaina – naatho raava
kadalilona – karuna choope dheepam kaava
ye bandhamo – anubandhamo
brathukantha needhegaa – karunincha raavayya
2. konda kona – ningi nela – chaalanantha
pongipoye – preme needhi – sandramantha
choose neevu – naadhu brathuku – bhaaramanthaa
aadharinche- amma vanti – daivame neevu
dayanu choope – dariki cherche – nesthame neevu
ye raagamo – anuraagamo
kada daaka neevega – krupa choopa ravayya