madhuramu yesuni naamamu మధురము యేసుని నామము
మధురము యేసుని నామము
మార్గము సత్యము జీవము
ఆయనే మధురము
ఆనందము – అతి ఆశ్చర్యము
చెప్పనశక్యము మహిమా యుక్తము
రక్షణ ఆనందము
Reference: 1 పేతురు 1:8,9
మారుమనసును – పొందిన సుదినము
పరమున ప్రభువును దూతలు కూడిరి
పరవసించిరి అమరము
Reference: లూకా 15:10
ఆరాధింతును అతిశయింతును
జత చేర్చెను నను జీవ గ్రంధమున
ఆయనే మధురము
Reference: లూకా 10:20
పంట పోయినా – పశువు రాలినా
శత్రువు సైతము తీయగ జాలని
ఈ సంతోషము మధురము
Reference: హబక్కూకు 3:17,18 & యోహాను సువార్త 16:22