ninne namminaa nee sannidhi cherinaa నిన్నే నమ్మినా నీ సన్నిధి చేరినా
నిన్నే నమ్మినా – నీ సన్నిధి చేరినా
నన్ను కాదనకు నా రక్షకా
నిన్నే చేరినా – నీ సన్నిధి కోరినా
నన్ను త్రోసేయకు నా యేసయ్య
ఆరిపోతున్నా – మసిబారిపోతున్నా
(నా) జీవితాన్ని – వెలిగించుమయ్యా
పడిపోతున్నా – పాడైపోతున్నా
నా బ్రతుకును – బాగుచేయుమయ్యా
సోలిపోతున్నా – సొమ్మసిల్లిపోతున్నా
నా హృదయాన్ని – ఓదార్చుమయ్యా
కృంగిపోతున్నా – కుప్పకూలిపోతున్నా
నా బ్రతుకును – బాగుచేయుమయ్యా