aaraadhanaku yogyudaa neeve maa sthuthula sthothraahudaa ఆరాధనకు యోగ్యుడా నీవే మా స్తుతుల స్తోత్రార్హుడా
ఆరాధనకు యోగ్యుడా నీవే మా స్తుతుల స్తోత్రార్హుడా
పదివేలలో అతి సుందరుడా నీవే మా పూజ్యనీయుడ
సెరాపులు కెరుబులతో
ఆరాధింప బడుతున్న పరిశుద్దుడా
తండ్రి దేవ తండ్రిదేవ నీవే అతిశ్రేష్ఠనీయుడవు
తండ్రి దేవ తండ్రిదేవ నీవే బహుకీర్తనీయుడవు
నిరంతరం మారనివాడ నా యేసయ్య
అనుక్షణం కొనియాడదగినది నీ నామం
నా హృదయమే నీ సింహాసనం
నాలో నివసించే నిరంతరం
నిత్యము నీలో నేను నిలిచియుండాలని
ప్రతీదినం నాతో నీవు కలిసియుండాలని
ఊపిరి నాలో ఉన్నంత వరకు
నీలో ఫలియించే భాగ్యమునిమ్ము
అంకితం నీ ప్రేమకై నా జీవితం
నీ చిత్తమును నెరవేర్చుటకు నా సర్వం
ఊహించలేనే నీ దయలేనిదే
నా బ్రతుకు శూన్యం నీ కృప లేనిదే