sarva sakthimanthudu advithiyadhevudu సర్వశక్తిమంతుడు అద్వితీయదేవుడు
సర్వశక్తిమంతుడు అద్వితీయదేవుడు
స్తోత్రములకు అర్హుడైనవాడు
యేసయ్యే నా ప్రాణ ప్రియుడు
హల్లెలూయా హల్లెలూయా
ధీనులకు అనాధలకు కృపచూపువాడు
ప్రేమించి రక్షించి పోషించువాడు
పాపమునుండి మనల విడిపించువాడు
శాంతజలముల చెంత నడిపించువాడు
ఆ యేసే నిజ ద్రాక్షావల్లి తీగెలము మనము
ఆయనలో ఫలియించి నిత్యము నిలిచెదము
ప్రభు ప్రేమ మాటలను ప్రేమింతుము
పరలోకవరములను పొందెదము