sthothram stuthi sthothram mahima ghanatha neeke స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమ ఘనత నీకే
స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమ ఘనత నీకే
అర్పింతును యేసయ్య
నా కోసం మరణించి తిరిగి లేచిన
నీకే నా స్తుతి స్తోత్రము
భాద కలుగు సమయములో నాకు తోడై నిలచి
కష్ట నష్టాలలో నాకు నీడై నిలచి
నను దైర్యపరచితివి నా వెంట నిలచితివి
నా కోసం మరణించి తిరిగి లేచిన
నీకే నా స్తుతి స్తోత్రము
నే చేసిన పాపముకై శిక్ష నీవు పొందితివి
నే చేసిన దోషముకై సిలువలో మరణించితివి
మృత్యుంజయుడై నిలచి మరణాన్నే గెలచితివి
నా కోసం మరణించి తిరిగి లేచిన
నీకే నా స్తుతి స్తోత్రము