subhadinam ee dinam శుభదినం ఈ దినం
శుభదినం ఈ దినం
మానవాలికే పర్వదినం
చీకటి పొరలను చీల్చుకొని
పరలోక కాంతులు విరజిమ్ముతూ
రక్షకుడు మన కొరకు ఉదయించినాడు
ఆనందించుడీ ఆనందించుడీ
ఆయన యందే ఆనందించుడీ
మరణపు ముల్లును విరచే
మహిమస్వరూపి ఇతడే
మనలను దేవుని దరిచెర్చే
దివ్యమైన నక్షత్రము ఇతడే
నిత్యజీవమునిచ్చే
సత్యస్వరూపి ఇతడే
మనకు అనుగ్రహింపబడిన
దేవుని బహుమానము ఇతడే