srama kaliginaa bhayapadaku శ్రమ కలిగినా భయపడకు
శ్రమ కలిగినా భయపడకు
శ్రమ పెరిగినా బెదిరిపోకు
శ్రమలందు దేవుని ప్రేమించినా
సమకూడును మేలు కొరకు
అన్ని సమకూడును మేలు కొరకు
శ్రమ ఓర్పును కలిగించును
నీరీక్షణ పెంపొందించును
శ్రమలందునా అతిశయించినా
సమకూడును మేలు కొరకు
అన్ని సమకూడును మేలు కొరకు
శ్రమ పూర్ణులనుగా చేయును
స్థిరపరచి బలముతో నింపును
శ్రమలందునా సంతసించినా
సమకూడును మేలు కొరకు
అన్ని సమకూడును మేలు కొరకు
శ్రమ మహిమను కొనితెచ్చును
విదేయత నేర్పించును
శ్రమలందునా ప్రార్ధించినా
సమకూడును మేలు కొరకు
అన్ని సమకూడును మేలు కొరకు
శ్రమ దేవునివైపు త్రిప్పును
ఆదరణతో వెలిగించును
శ్రమలందునా స్తుతియించినా
సమకూడును మేలు కొరకు
అన్ని సమకూడును మేలు కొరకు