sathakoti vandhanaalu yesu swami neeku శతకోటి వందనాలు యేసు స్వామి నీకు
శతకోటి వందనాలు యేసు స్వామి నీకు
కరుణించి కాపాడుమయా
కాలాలన్ని మారినట్టు మారిపోని నీకు
మా నిండు వందనాలయ్య
నీ చల్లని చూపు మాపై నిలుపు
నీ కరుణ హస్తం మాపై చాపు
యోసేబు అన్నలంత దోసేసినా
బానిసగా బయట అమ్మేసినా
చెయ్యని నేరాలన్ని మోపేసినా
చెరసాలలో అతని పడేసినా
చల్లంగ చూచినావు
నీ చెయ్యి చాచినావు
భాధించిన దేశానికే
ప్రధాని చేసినావు
ఆరునూరల జానెడైనా
గొలియాతు యెంతో ధీరుడైనా
దేవుని హ్రుదయానుసారుడైన
దావీదును చిన్నచూపు చూసిన
చల్లంగ చూచినావు
నీ చెయ్యి చాచినావు
అభిశేకించి నీవే
రాజుగా చేసినావు