lekkimpa sakyamu kaavu devaa ne kaaryamulu లెక్కింప శక్యము కావు దేవా నీ కార్యములు
లెక్కింప శక్యము కావు దేవా నీ కార్యములు
నా హృదయము పాడుచు పొగడెను దేవా నీ నామమును
నిదురెరుగక నను కాయుచు నీతి సూర్యుడ నను మరువక
నను కాచినావు నీవు ఎల్లపుడు
కష్టములే కదలక నన్ను కాల్చుకొని తిన్నవిలే
శోధనలే సంద్రంలా నాపైకి ఎగసెనులే
నా కన్నీళ్లు తుడిచావు నా కాపరి నీవై నిలిచావు
శాపముల భారముతో బ్రతుకే బరువాయేనులే
గమ్యమే తెలియని పయనం పాదములె పరుగెడులే
నాకు తోడై నిలిచావు నీ కౌగిలిలో నను దాచావు
సర్వము కోల్పోయి నే జీవచ్చవమైయుంటిని
వీడని కన్నీళ్లతో మూల్గుచు నేనుండగ
నాకు తోడై నిలిచావు నీ నీడలో నను దాచావు