raaraju puttinaadu nedu ilalo రారాజు పుట్టినడు నేడు ఇలలో
రారాజు పుట్టినడు నేడు ఇలలో
సంతోషమే తెచ్చినాడు జగతిలో
ఉహించలేనిదయినా కలలో
ఒక్కడుగా చేరెనే మనలో
వేవెలా దూతలు స్తోత్రాలు పాడెను
ప్రభువు రాకతో హృదయాలు వెలిగెను
చీకటి రాజ్యాలు కూలిపోయెను
మరణము సంకెళ్లు విడిపోయెను
ప్రేమకు రూపం దొరికింది నేడు
దేవుడే భువి దిగి వచ్చినాడు
ఆనందమానందం సాగాలి సంబరం
సాతాను పైన నేడు గెలవాలి సమరం
బానిసలు అయిన మనుషులను చూసి
నరకమును చేర్చె పాపాలపై రోసి
వెలను చెల్లించాలని వచ్చినాడు
తనను చేర్చె రక్షణను తెచ్చాడు
అందరమూ చేరి చేయాలి పండుగ
రక్షణ ఫలములు పొందాలి నిండుగా
రారాజు పుట్టినడు నేడు ఇలలో
సంతోషమే తెచ్చినాడు జగతిలో
ఉహించలేనిదయినా కలలో
ఒక్కడుగా చేరెనే మనలో
రేపోమాపో అని ఆలస్యం చెయ్యక
యేసును చేరగా అడుగేయ్ నువ్ వెరవక