raajula raaju puttaadandi రాజుల రాజు పుట్టాడండి
రాజుల రాజు పుట్టాడండి
రక్షణ లోకానికి తెచ్చాడండి
ప్రభువుల ప్రభువు పుట్టాడండి
పరమును వీడి వచ్చాడండి
ఆనందం ఆనందం ఇలలో ఆనందం
అంబరాలు అంటే సంబరాలు చేసేద్దాం
దూతలే దిగివచ్చెను
యేసు రాజునే సేవించెను
గొల్లలంత కూడివచ్చెను
మహరాజునే స్తుతియించెను
పాపవిమోచకుడు రక్షకుడు అని
స్తుతియించి నాట్యమాడిరి
ఆకాశంలో తార వెలసెను
ప్రభు జాడనే చూపించెను
జ్ఞానులు వెదకి వచ్చెను
గొప్ప కానుకలే ప్రభువుకిచ్చెను
గొప్ప దేవుడని ప్రభువుల ప్రభువని
ఘనపరచి కొనియాడిరి
లోకమంత సంతోషము
ప్రతి మనసులో రక్షణానందము
జనమంతా చూడవచ్చెను
యేసురాజు మహ జననము
రాజుల రాజని ప్రభువుల ప్రభువని
పూజించి మహిమపరిచిరి