yesu leni jeevitham ela gadapanu యేసు లేని జీవితం ఏల గడపను
యేసు లేని జీవితం ఏల గడపను
యేసు రాకకై నేను వేచియున్నాను
దేవా.. దేవా..రావా.. నను బ్రోవా
పాపంధకారములో బంధీనైయున్న నన్ను ప్రేమించితివి
చిందించితివి నీ రుధిరము నాకై
ప్రకటింతు నీ ప్రేమను అంతమువరకు
విశ్వాసయాత్రలో ఎగసిపడిన సుడిగుండాలెన్నో ముంచివేసిన
నడిపించు నా ప్రభువా నా నావను
విడనాడడు ఎన్నడూ అంతము వరకు
కడబూర ధ్వనితో దూతలతో తిరిగి రానైయున్నా నా ప్రియ ప్రభువా
కొనిపోవును నన్ను పరలోకముకు
ఈ కాoక్షతో నేను వేచియుంతును
యేసు లేని జీవితం ఏల గడపను
యేసు రాకకై నేను వేచియున్నాను
దేవా.. దేవా..రావా.. నను బ్రోవా