yesayye premaku prathiroopamu యేసయ్యే ప్రేమకు ప్రతిరూపం
యేసయ్యే ప్రేమకు ప్రతిరూపం
యేసయ్యే జగతికి నిజ దైవము
ఆ మాటల్లో ఆశ్చర్యకార్యాలు
ఆ చూపుల్లో అద్భుతాలు ఎన్నో
యేలీషాదాయ్ – సర్వశక్తిమంతుడా
అడోనాయ్ – ప్రభువుల ప్రభువా
ఎలోహిమ్ – సర్వ సృష్టికర్త
ఎలోలాం – నిత్యుడగు దేవా
కాలం తిరిగి రాదు – సమయం ఇంకా లేదు
నీవు క్రీస్తుని ప్రభువుగా ఒప్పుకో హృదయంలో
ప్రేమామయుడే నా యేసయ్య
ప్రేమించి రక్షించును
ఈ లోకం అశాశ్వతం – పరలోకమే నిత్య జీవం
ప్రభు యేసునందే నిత్యము ఆనందం
యుగయుగములు పరమ తండ్రితో
కలకాలం జీవింతుము