munduku saagedhanu ముందుకు సాగెదను
ముందుకు సాగెదను
నా ఈ జీవిత పోరాటంలో
ఎందరు నన్ను చూసి నవ్విన
ముందుకు సాగెదను
యేసయ్యే నా గమ్యము
ఆయన్ను చేరు వరుకు సాగెదను
నా అని అనుకున్న వారందరు
నీవెవరు అంటు నన్ను వెలివేసారే
ఎవరు నిన్ను విడచినను
నే విడువనంటూ నా యేసు పిలిచాడే
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా నా యేసుకే
అడుగులు నావి తడబడినను
వెళ్లే దారి నాకు తెలియకపోయినను
దారి చూపి నడిపిస్తున్నాడు
పాడుటయే నా పని అన్నాడు
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా నా యేసుకే