manishini praanamgaa preminchina devudu మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు
మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు
మనిషికై ప్రాణాన్ని అర్పించిన నాధుడు
మనకోసమే నేడు జన్మించెను చూడు
హల్లెలూయా పాడు సంతోషమే నేడు
ప్రవచనాలన్నియు నెరెవేర్చెనే నాడు
ప్రపంచాన్ని రక్షింప జన్మించెను నేడు
పశువుల పాకలో పవళించెనే
పరలోకమే ప్రస్తుతించెనే
పాపులందరిని ప్రేమించిన వాడు
పాపుల రక్షణకై ప్రాణం పెట్టినవాడు
పశువుల పాకలో పవళించెనే
పరలోకమే ప్రస్తుతించెనే