mandhira mandhuna cherinaanu మందిరమందున చేరినాను
మందిరమందున చేరినాను
డెందము పగిలిన పాపిని నేను
అందరిలో అతియల్పుడ నేను
పాపుల లోన ప్రథముడ నేను
నను గరుణింపగ యర్హుడగాను
పాపములో జన్మించిన నేను
మరణము వశమై పోయినాను
శాస్త్రుల పరిసయ్యుల తులతూగను
జనములలో నేనధికుడ గాను
శాస్త్రము నించుక మాత్రమెరుగను
సోదరుని ప్రేమించుట మెరుగను
కరుణింపుమని వేడుచున్నాను
పావనుడా నిను చూడగ లేను
మరణమునుండి విమోచన గోరి
రక్షణకై నే చేరినాను
మందిరమందున చేరినాను
డెందము పగిలిన పాపిని నేను
అందరిలో అతియల్పుడ నేను