ninupolina vaarevaru నినుపోలిన వారెవరు
నినుపోలిన వారెవరు
మేలుచేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా
నిన్నే నా జీవితమునకు
ఆధారము చేసికొంటిని
నీవులేని జీవితమంత
వ్యర్దముగా పోవునయ్య
ఎల్షదాయ్! ఆరాధన
ఎలోహీం ! ఆరాధన
అదొనై! ఆరాధన
యేషువ! ఆరాధన
కృంగిఉన్న నన్ను చూచి
కన్నీటిని తుడిచితివయ్య
కంటిపాప వలె కాచి
కరుణతో నడిపితివయ్య
మరణపు మార్గమందు
నడచిన వేలయందు
వైద్యునిగా వచ్చి నాకు
మరో జన్మనిచ్చితివయ్య
ఎల్షదాయ్! నీకే ఆరాధన
ఎలోహీం ! ఆరాధన
అదొనై! ఆరాధన
యేషువ! యేషువ!
ఎల్షదాయ్! ఆరాధన
ఎలోహీం ! ఆరాధన
అదొనై! అదొనై!
అదొనై! ఆరాధన