neethodu chaalayya naa balamu neevayyaa నీతోడు చాలయ్య నా బలము నీవయ్యా
నీతోడు చాలయ్య నా బలము నీవయ్యా
నా నిరీక్షణాస్పదం నీవే యేసయ్య
తరములకైనా యుగములకైనా నీవే ఆధారం
ఆశ్రయం ఆనందం నీవే నా ప్రభువా
భయమొందిన వేళలో ధైర్యమిచ్చు దేవుడవు
భాద నొందు వేళలో బలపరచు దేవుడవు
నిన్ను వీడి నేను ఎలా బ్రతుకగలను
నీవులేని జీవితం శూన్యమే కదా
చీకటిలో సంచరించినా తెగులు రానియ్యవుగా
పదివేలమంది కూలినా అపాయం రాదుగా
నేను మొఱ్ఱపెట్టగా ప్రార్థనాలకించితివి
నాకు కలుగు భయము నుండి విడిపించితివి
నీతోడు చాలయ్య నా బలము నీవయ్యా
నా నిరీక్షణాస్పదం నీవే యేసయ్య
తరములకైనా యుగములకైనా నీవే ఆధారం
ఆశ్రయం ఆనందం నీవే నా ప్రభువా