Needanu polinaa dhinamulu tharuguchunnavi నీడను పోలి నా దినములు తరుగుచున్నవి
నీడను పోలి నా దినములు తరుగుచున్నవి
కాలము జీవము కలవలే కరుగుచున్నవి
సంపాదించలేను కోల్పోయిన ఏ క్షణము
లోకములో గడిచెను వ్యర్ధముగా అనుదినము
దేవుని కొరకై జీవించిన దినములు స్వల్పము
నా జీవిత యాత్రలో గడిపిన దినములు అధికము
కాలం వెలుగుతున్న కొవ్వొత్తి అని తెలియక కరిగించేశాను లోకంలో అతి సులువుగా..
దినములు తిరిగిరాని మేఘాలు అని ఎరుగక కురిపించేశాను సంద్రములో వ్యర్ధముగా..
దేహము ముడతలుగా అడుగులు తడబడగా
కన్నులు కనబడక కాటికి త్వరపడగా
ఊపిరి భారముగా అందరు దూరముగా
మంచమే మిత్రునిగా రోగము ఆప్తునిగా
సంతోషము దొరకని సంవత్సరాలెదురవగా
సంతాపముతో నిట్టూర్చుతున్న యాత్రికునిగా
సూర్యుని క్రింద నూతనత్వం లేదని తెలియక గాలిలో వెదికాను క్రొత్త కొరకు కోరికగా..
పూర్వులు జ్ఞాపకముకు రారని నే గుర్తించక పేరుకు ప్రాకులాడి మిగిలాను ఒంటరిగా..
హృదయము త్వరపడగా కోరిక బలపడగా..బ్రతుకును దాటిరాగా ఆయాసం దుఃఖమేగా..
వెనుకకు చూసుకొనగా అంతా వ్యర్ధమేగా నిజమెరిగేలోగా.. నా కధ ముగిసెనుగా..
మన్నయినది మరలా మన్నుకు చేరేలోగా .. మహిమను వెదుకుటయే జీవిత పరమార్ధముగా..
నీడను పోలి నా దినములు తరుగుచున్నవి
కాలము జీవము కలవలే కరుగుచున్నవి
సంపాదించలేవు కోల్పోయిన ఏ క్షణము
దినములు లెక్కించుట నేర్చుకొనుటయే ముఖ్యము
దేవునికొరకై జీవించడమే పరమార్ధము
మానవకోటికి ఇదియే విధి అని ఫలితార్ధము
needanu polinaa dhinamulu tharuguchunnavi
kaalamu jeevamu kalavale karuguchunnavi
sampaadhinchalenu kolpoyina ey kshannamu
lokamuloo gadichenu vyardhamugaa anudhinamu
dhevuni korakai jeevinchina dhinamulu swalpamu
naa jeevitha yaathralo gadipina dhinamulu adhikamu
kaalam veluguthunna kovvotthi ani theliyaka kariginchesaanu lokamlo athi suluvugaa…
dhinamulu thirigiraani meghaalu ani erugaka kuripinchesaanu sandhramulo vyardhamugaa
dhehamu mudathalugaa adugulu thadabadagaa
kannulu kanabadaka kaatiki thwarapadagaa
oopiri bharamugaa andhru dhooramugaa
manchame mithrunigaa rogamu aapthunigaa
santhoshamu dhorakani samvathsaraaledhuravagaa
santhaapamutho nittoorchuthunna yaathrikunigaa
sooryuni krindha noothanathvam ledhani theliyaka gaalilo vedhikaanu krottha koraku korikagaa
poorvulu gnyapakamuku raarani ne gurthinchaka peruku praakulaadi migilaanu ontarigaa
hrudhayamu thvarapadagaa korika balapadagaa brathukunu dhaatiraagaa aayaasam dhuhkhamegaa
venukaku choosukonagaa anthaa vyardhamegaa nijamerigelogaa naa katha mugisenugaa
mannayinadhi maralaa mannuku cherelogaa mahimanu vedhukutaye jeevitha paramaardamugaa
needanu polinaa dhinamulu tharuguchunnavi
kaalamu jeevamu kalavale karuguchunnavi
sampaadhinchalenu kolpoyina ey kshannamu
dhinamulu lekkinchuta nerchukonutaye mukhyamu
dhevunikorakai jeevichadame paramaardamu
maanavakotiki idiye vidhi ani phalithaardhamu