naa nireekshana neelo undagaa నా నిరీక్షణ నీలో ఉండగా
నా నిరీక్షణ నీలో ఉండగా
నేనెన్నడు సిగ్గుపడకుందును
నా ఆశలు ఫలియించెనే
సీయోనులో ఆనందమే
నిత్య సంతోషమే
భూమి మీద భక్తులు శ్రేష్ఠులు
వారు నీకు ఎంతో ఇష్టులు
గాలి రెక్కల మీద ప్రత్యక్షమైతివి
విశాల స్థలములకు తోడుకొని వచ్చితివి
నా ఆశ్రయమైతివి
పరిశుద్ధ పర్వతం ఎక్కించితివి
నీ గుడారములో అతిధులమైతిమే
నూనెతో నా తల అంటబడెను
నా గిన్నె నిండి పొంగి పొర్లెను
నాకు ధన్యమాయెను