నా జీవితానికి యజమానుడా
నా జీవితానికి యజమానుడా
నిను మాత్రమే కొలుతునేసయా
నిత్య మహిమలో నిను చూచే వరకు
నా స్తుతి యాగము ఆపనేసయా
కన్నీటి లోయ ఆవేదనల ఛాయ
లోకపు మాయ నే తాళలేనయా
అరచేతిలో చెక్కుకున్నవాడా
ఈ జీవితము నీదెనయా నీ వాడనేసయా
గుండె జారిపోయె నిందలెన్నో
ఆత్మీయులతో అవమానాలెన్నో
పోరాడుటకు నా బలము చాలక
నీ పాదాలపై ఒరిగినానయా ఒదిగిపోతానయా
నా యాత్రలో ఏమి జరిగిన
స్తుతియించుచునే నే సాగిపోదును
నా తనువంతా నీ పని కోసమే
నీ అర్పణగా నేను మారితినయా నిన్ను చేరితినయా