naenu nee vaaaodanu dhaevaa niనేను నీ వాఁడను దేవా నిక్కంబుగ
నేను నీ వాఁడను దేవా నిక్కంబుగ నేను నీ వాఁడను దేవా వీనుల నీ
ప్రేమ వివర మాలించుచు మేను నాత్మయు నిత్తు మేలొసఁగు
నీకిపుడు ||నేను||
1. ఘనుఁడ వైన నీవు గలిగించితివి నన్ను మనుజ లోకమునందు నిను
నేను సేవింప ||నేను||
2. నాకు నవసర మౌన నానా వస్తువు లిచ్చి నీ కటాక్షము నన్ను
నిల్పుచున్నది గాన ||నేను||
3. నా దోషముల నుండి నన్ను రక్షింపను నీదు పుత్రుని ప్రేమ నిండార
నొసగితివి ||నేను||
4. నే నఘముల చేత నిజముగఁ జావఁగ నీ నెనరుచే నన్ను నీవు
బ్రతికించితివి ||నేను||
5. నా తనువు నాత్మయు నాకుఁ గల్గిన వన్ని నా తండ్రి యిచ్చితివి నాకు
నీ కృప చేత ||నేను||
naenu nee vaaAOdanu dhaevaa nikkMbuga naenu nee vaaAOdanu dhaevaa veenula nee
praema vivara maaliMchuchu maenu naathmayu niththu maelosAOgu
neekipudu ||naenu||
1. ghanuAOda vaina neevu galigiMchithivi nannu manuja loakamunMdhu ninu
naenu saeviMpa ||naenu||
2. naaku navasara mauna naanaa vasthuvu lichchi nee kataakShmu nannu
nilpuchunnadhi gaana ||naenu||
3. naa dhoaShmula nuMdi nannu rakShiMpanu needhu puthruni praema niMdaara
nosagithivi ||naenu||
4. nae naghamula chaetha nijamugAO jaavAOga nee nenaruchae nannu neevu
brathikiMchithivi ||naenu||
5. naa thanuvu naathmayu naakuAO galgina vanni naa thMdri yichchithivi naaku
nee krupa chaetha ||naenu||