devaloka mahimanthaa bhuvi paiki thechaadu దేవలోక మహిమనంతా భువిపైకి తెచ్చాడు
దేవలోక మహిమనంతా భువిపైకి తెచ్చాడు
దీనురాలి కడుపునుండి యేసు ఉదయించాడు
మానుజాళి పై ప్రేమతో దేవదేవుడు
నరరూపమెత్తి బాలుడై నేల కాలు మోపినాడు
కలిగెను విడుదల సంతోషం క్రిస్మస్
వెలిగిన మనసుల సంబరం క్రిస్మస్
చీకటిని దూరం చేసి దివ్యమైన కాంతిని చూపి
ఎప్పుడూ మన తోడై నడిపిస్తాడు
కీడు ఏది రాకుండా దీవెనలు పోకుండా
కంటి పాపలా కాచి భద్రం చేసే ప్రాణప్రియుడు
పాపితోటి స్నేహం చేసి పాపముల శిక్షను బాపి
ఎప్పుడూ మన మధ్యే నివసిస్తాడు
లోటు చూడనీకుండా ఆటంకాలు లేకుండా
అన్నింటిని సమకూర్చి సాయం చేసే ప్రాణప్రియుడు
వేదనను మాయం చేసి గుండెలోని బాధను మాన్పి
ఎప్పుడూ మనతోనే పయనిస్తాడు
శత్రుబారి పడకుండా ఆశయాలు చెడకుండా
చుట్టూ కేడెమై యుండి కార్యం చేసే ప్రాణప్రియుడు