dhigivachenu maraninchutakai దిగివచ్చెను మరణించుటకై
దిగివచ్చెను మరణించుటకై
పరిశుద్ధుడు పరమును వీడి
మన దోషములు తొలగించుటకై
తలవంచెను ఆ శిలువపై
లోకమును తానెంతో ప్రేమించెను
తన ప్రాణమును బలియాగముగా అర్పించెను
మనకై యేసు మరణించెను
దైవసుతుడు యేసు దేవుడు
ఈ భూమిపై ఉదయించెను
తాను సృజించిన మనుష్యులతో
మాటలాడ దిగివచ్చెను
తండ్రి పంపిన ప్రేమ సువార్తను
వారికి తెలిపెను
ఆ మాటలు నమ్మని కఠినులు
యేసుని సిలువకీడ్చిరి
సకల జనుల పాపమంత
తన భుజముపై మోసెను
నెత్తురు ధారలై కారుచుండగ
నొప్పిని బరియించెను
తండ్రి గుండెలో నిండిన ప్రేమను
శిలువపై చూపించెను
ఆ ప్రేమను మరువక నమ్మిన వారికి
జీవము దొరుకును