tharinchiponi nee premalone తరించిపోని నీ ప్రేమలోనే
తరించిపోని నీ ప్రేమలోనే
ఓ యేసు దేవా నీ దాసినై
నీ సేవలోనే నేనుండిపోని
నీ ప్రేమ గీతం నే పాడుకోని
నీ కంటిపాపై నిలువగలేనా
ఈ జీవితం నీదని ఏలుకోలేవా
ఉదయం రవి కిరణం వరమై తాకని
మనసే మైమరచి నిను సేవించని
వెన్నెలే సాక్షిగా స్తుతులనే పాడని
కన్నుల రూపమే దీపమై వెలగని
చక్కని చెలిమిని ప్రేమతో కోరెదా
పదనం నవ కమలం నీతో సాగని
మధురం నీ చరితం నేనే పాడని
మోక్షమే జీవమై హాయిగా తాకని
యేసుతో ప్రాణమై సాగని పయణమే
కమ్మని గానమై దైవమా చేరెదా