thandri thanayuni bhoomiki pampina ee vela shubavela తండ్రి తనయుని భూమికి పంపిన ఈ వేళ శుభవేళ
తండ్రి తనయుని భూమికి పంపిన ఈ వేళ శుభవేళ
భూమిని తలక్రిందులుగా చేసే మెసయ్యే వచ్చె బాలునిగా
ఆకాశంలో దూతలు పాడే
భూమి అంతా సంబరమయే
సింహాసనమే వదిలాడయ్యా
మనుష రూపము దాల్చి వచ్చాడయ్య
కోరి వచ్చెను కారణ జన్ముడే
కాడి మోయను కదిలెను కరుణాత్ముడే
నశించిపోవుట తనకు ఒప్పనొల్లక
నరరూపం దాల్చి భువికి వచ్చాడయ్యా
కాడి మోయుట భారమని ఎంచక
కరుణాత్ముడే మన భారం మోసాడయ్య
రాజు మారెను దాసుని గాను చేసికొనెను రిక్తునిగాను
పశుల పాకలో పరుండినాడయ్యా
నీ కొరకు నా కొరకు మన మెస్సయ్యా
తనకు మనకున్న అడ్డుతెరలను
తొలగించ తానే వచ్చాడయ్యా
లేదు లేదుగా ధాస్యమిక లేదుగా
ఆ పరముకు వారసులు నువు నేనుగా
మనకై పుట్టెను ఇలలో రేడు రక్షణ వచ్చెను
మన ఇంటికి నేడు
సంతోషమునే నింపాడయ్యా
మన బ్రతుకులలో ఆ మెసయ్యా