jeevadaatha sthuthipaathrudaa జీవదాత స్తుతిపాత్రుడా
జీవదాత స్తుతిపాత్రుడా
నన్నేలు దేవా నజరేయుడా
ప్రేమ చూపి పిలిచినావు ప్రాణ నాధా పరమాత్ముడా
నీవు లేక ఇలలో నేను బ్రతుకలేను నిజ దేవుడా
జీవదాత స్తుతిపాత్రుడా
నన్నేలు దేవా నజరేయుడా
ప్రేమ చూపి పిలిచినావు ప్రాణ నాధా పరమాత్ముడా
అంధకార ఈ జగాన నీవే చాలు నా యేసయ్య
1. లోక ప్రేమలు – నను వీడినా
విరిగి నలిగి వేసారినా
ఎదురుగ – నిలచిన – ప్రేమే నీవు – ఎడబాయవు
గాలి వానలు చెలరేగినా
కృంగి నేను పడిపోయినా
అలలలో – మరువని – ఆశే నీవు – విడనాడవు
యేసయ్యా – నీ స్నేహమే
యేసయ్యా – నా భాగ్యమే
చల్లగా – చూసావుగా
ధరలో – సుఖమై – వరమై నా తల్లిగా
చెరలో – బలమై – నిలిచే నా తండ్రిగా
2. నీదు మార్గము – పరిపూర్ణము
ఇలలో నాకు – జయగీతము
అనిశము – అభయము – నీవే దేవా – పరమాత్ముడా
నీదు నామము – అతి శ్రేష్టము
పలికె నాలో – స్తుతి గీతము
మహిమయు – ఘనతయు – నీకే దేవా – పరిశుద్ధుడా
యేసయ్యా – నీ వాక్యమే
యేసయ్యా – ఆధారమే
ప్రేమతో – కోరానుగా
కృపతో – చెలిమై – మలిచే నా బంధమా
మదిలో – కొలువై – నిలిచే ఆనందమా