jeevitha naava nadupumu deva జీవిత నావ నడుపుము దేవ
జీవిత నావ నడుపుము దేవ
నావ యధికారివి కావా
నా నావ యధికారివి కావా
బ్రతుకెల్ల నీ – ధ్యాసను కలిగి
పతనమనే – శత్రువు నోడించి
లతను బోలి – నీవాధారముగా
ఋతువులెల్ల – ఫలించెద
నే ఋతువులెల్ల – ఫలించెద
నీరాకడకై – నే – వేచెదను
పోరాటములన్నిటి నెదురింతును
ఆరాధించు – మనస్సును నేను
ధారాళమ్ముగ – గోరెదను
నే ధారాళమ్ముగ – గోరెదను
రాకడ గురుతులు – నెరవేరగను
లోకపు మాయలు – మితిమీరగను
చీకటి నరులను – రక్షింపుమని
యేకధారగ – వేడెదను
నే యేకధారగ – వేడెదను
జీవిత నావ నడుపుము దేవ
నావ యధికారివి కావా
నా నావ యధికారివి కావా