kondalathattu kannuletthi choosaanu yesayya కొండలతట్టు కన్నులెత్తి చూసాను యేసయ్యా
కొండలతట్టు కన్నులెత్తి చూసాను యేసయ్యా
ఎత్తైన చోట్లలో వెదకి వేచాను యేసయ్యా
దొరకలేదయ దొరకలేదయా నాకు సహాయమెక్కడ
నా చెంతనె ఉండే నా ప్రక్కలొ వుండే
నా హృదయంలొ ఉండే నీవె నాకు సహాయం
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రం నీకె యేసయ్యా
భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా
నా పాదములను ఎన్నడు నీవు తొట్రిల్లనీయవు
ఇశ్రాయేలు జనులను కాపాడిన దెవా
నా క్షేమము కోరి కునుకును నిద్రను పోని వాడవు
నా కుడిప్రక్క వేయి మంది పడిపోయినా
నా ఎడమ ప్రక్క పదివేలు కూలిపోయినా
నాకు తోడు నీడై నన్ను కాపాడువాడవు – కాపాడువాడ
సాంద్రము నడిమికి చీల్చి మార్గము వేసిన దేవా
కీడును హతమార్చినన్ను కాపాడువాడవు
అడవిలొ మన్నాతో ఆకలి తీర్చిన దేవా
కొదువలేకుండ నన్ను పోషించువాడవు
అగ్నివంటి శ్రమలు కాల్చివేయచూచినా
మాయ రోగములు చంపివేయచూచిన
బ్రతుకుదినములన్ని నాతో ఉండి కాయువాడవు – కాయువాడవు